![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో....రామరాజు వాళ్ళు ఇంటికి వస్తాను అనడంతో భాగ్యం టెన్షన్ పడుతుంది. మనం బాగా డబ్బున్నోళ్ళమని బిల్డప్ ఇచ్చినాం.. ఇప్పుడు వాళ్ళు ఈ కొంపని చుస్తే ఇంకేమైనా ఉందా నేను చదవిందే ఆరో తరగతి.. బిటెక్ అని చెప్పావని శ్రీవల్లి అంటుంది. ఇవన్నీ సమస్య కంటే ఇంకొక పెద్ద సమస్య ఉంది. రేపు ఇంటికి వస్తే మనం ఉండే ఈ అద్దె కొంపని చూస్తారని భాగ్యం చిన్న కూతురు అంటుంది. అలా జరగకూడదు. ఇలాంటి బకరా సంబంధం మళ్ళీ దొరకదని భాగ్యం అంటుంది.
మరొకవైపు రామరాజు కుటుంబం అందరు భాగ్యం ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. ధీరజ్, ప్రేమ ఇద్దరు కాలేజీకీ రెడీ అవుతారు. ప్రేమ అని వేదవతి పలకరిస్తుంటే.. బాయ్ అత్తయ్య అంటూ బయటకు వస్తుంది. ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. బాధపడుతుంది.. అయిన కూడా ధీరజ్ మాట్లాడకుండా సైలెంట్ గా ప్రేమని ఎక్కించుకొని వెళ్తాడు. మధ్యలో తనని దింపేసి కాలేజీకి వెళ్తాడు. ప్రేమ ఆటోలో కాలేజీకి వెళ్తుంది. రామరాజు వాళ్ళందరు భాగ్యం ఇంటికి బయల్దేరతారు. మరొకవైపు అమ్మ ఎక్కడికి వెళ్ళింది. వాళ్ళు వస్తారని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.
అప్పుడే రామరాజు కుటుంబం ఆ గల్లీలోకీ వస్తారు. వాళ్ల ఫోన్ కలవకపోవడంతో ఒకతనికి శ్రీవల్లి నాన్న ఫోటో చూపించి వీళ్ళ ఇల్లు ఎక్కడ అనగానే.. ఇడ్లీ అమ్మే అతను కదా అనుకొని చూపిస్తానంటూ తన వెంట తీసుకొని వెళ్తాడు. రామరాజు వాళ్ళని చూసి శ్రీవల్లి వాళ్ళు దాక్కుంటారు. రామరాజు లోపలికి వెళ్తుంటే.. అప్పుడే భాగ్యం బాగా రెడీ అయి అన్నయ్య ఇక్కడ అంటూ పిలుస్తుంది. ఇదే మీ ఇల్లని చెప్పారనగానే చెప్పింది ఎవడు అని చెప్పిన అతన్ని భాగ్యం బెదిరిస్తుంది. తరువాయి భాగంలో మంచి ఇంట్లోకి భాగ్యం వాళ్ళని తీసుకొని వెళ్తుంది. చందు, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. నర్మద బాధపడేలా భాగ్యం మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |